Allu Arjun । చట్టం ముందు అందరూ సమానమే.. రాజకీయ నాయకులకు, సినిమా హీరోలకు మరో చట్టం ఉండదు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని 

తప్పు ఎవరూ చేసినా చట్టం ముందు అందరూ సమానమేనని, హిరోలు, రాజకీయ ప్రముఖులకు ఒక చట్టం, సామాన్యులకు మరో చట్టం ఉండదని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.

Allu Arjun । చట్టం ముందు అందరూ సమానమే.. రాజకీయ నాయకులకు, సినిమా హీరోలకు మరో చట్టం ఉండదు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని 
Allu Arjun । తప్పు ఎవరూ చేసినా చట్టం ముందు అందరూ సమానమేనని, హిరోలు, రాజకీయ ప్రముఖులకు ఒక చట్టం, సామాన్యులకు మరో చట్టం ఉండదని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో హిరో అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేస్తే దానిని కొన్ని పార్టీల నాయకులు రాజకీయ రంగు పులిపి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సంధ్య థియేటర్లో జరిగిన సంఘటనను రాజకీయ కోణంలో కాకుండా మానవత దృక్పథంతో చూడాలన్నారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ సంధ్యథియేటర్ ఘటనను పూర్తిగా విశ్లేషించి చెప్పేవరకు పూర్తి విషయాలు ఎవరికీ తెలియలేదన్నారు. ఈ ఘటనతోనైనా ప్రభుత్వం మేల్కొని సినిమా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని, ఇందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను సంస్కరించి, ఈ సినిమా రంగం పూర్తిగా సమాజానికి ఉపయోగపడే విధంగా కొత్త చట్టాలను రూపొందించాలని కోరారు. సందేశ్మాతకంగా నిర్మించే చిన్న సినిమాలకు అన్ని రకాలు ప్రొత్సాహాం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. బౌన్సర్ వ్యవస్థను అనుమతించకూడదన్నారు. రక్షణ పేరులో బౌన్సర్లు లైసెన్స్ గుండాలా మితిమీరి వ్యవహరిస్తూ ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నారని,దీనిని ఇక మీదట ప్రోత్సహించకుండదని అన్నారు. సెలబ్రిటీలకు భద్రత పరమైన రక్షణ కోసం పోలీసుల సేవలను వినియోగించుకునే లా చర్యలు తీసుకోవాలని కూనంనేని సాంబశివరావు కోరారు. హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి నరసింహా, కార్యవర్గసభ్యులు మర్రి వెంకటస్వామి, మందపవన్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి వివరాలను కూనంనేని సాంబశివరావు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకునేలా మరింత మెరుగైన వైద్య చికిత్సను అందించాలని ఆయన వైద్యులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్ప2 సినిమా బెన్‌ఫిట్ షోలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో రేవతి చనిపోగా, ఓ తల్లి మరణిస్తూ కూడా తన కన్న కొడుకును కాపాడునేందుకు చేసిన ప్రయత్నం ఫలించిందని, గాయపడిన కొడుకు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటున్నారని, ఆయన వైద్యానికి స్పందిస్తున్నట్లు డాక్టర్లు వివరించారని  కూనంనేని సాంబశివ రావు తెలిపారు.
 ఏడాది పొడవునా సీపీ ఐ శతాబ్ది ఉత్సవాలు
సిపిఐ శతాబ్ధి ఉత్సవాలను ఈ డిసెంబర్ 26నుంచి 2025 డిసెంబర్ 26 వరకు ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,ఎంఎల్ ఏ కూనంనేని సాంబశివరావు తెలిపారు.1925లో డిసెంబర్ 26 తేదీన కాన్పూర్ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆవిర్భావించిందని,శతాబ్ది వేడుకలను ఈ నెల 26 అక్కడి నుంచే ఘనంగా ప్రారంభం అవుతాయని వివరించారు.ఈ వేడుకల్లో భాగంగా ఈనెల 30వ తేదీన నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఈ ఏడాది పొడవునా అన్నివర్గాల ప్రజల సమస్యలు, అసంఘంటిత కార్మికులు, ఉద్యోగుల సమస్యల ఎజెండాగా చేసుకుని వాటి పరిష్కారానికి సభలు, సమావేశాలు, ఆందోళనలు వివిధ రూపాల్లో కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.ముగింపు ఉత్సవాల్లో భాగంగా వచ్చే డిసెంబర్ ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కూనంనేని సాంబశివరావు తెలిపారు.