13న పోలింగ్ .. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : సీఈఓ వికాస్ రాజ్
13న పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ 4 గంటల వరకు వెల్లడించిన సీఈఓ వికాస్ రాజ్, ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : సీఈఓ వికాస్ రాజ్

- 13న పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
- ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ 4 గంటల వరకు వెల్లడించిన సీఈఓ వికాస్ రాజ్
విధాతః లోక్ సభ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ఈ మేరకు శనివారం బీ ఆర్కే భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఉంటుందని వెల్లడించారు. మేరకు ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్, పెద్దపల్లి పరిధిలోని చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్ పరిధిలోని భూపాల్ పల్లి, మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజక వర్గాలలో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికతో సహా మిగిలిన అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్ లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
పోలింగ్ సాఫీగా జరిగేందుకు 160 కంపెనీల కేంద్ర బలగాలు, 72 వేల స్టేబ్ పోలీస్, 20 వేల మంది పోలీస్ సిబ్బందిని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించామన్నారు. మరో నాలుగు వేల మంది అదర్ యూనిఫామ్ సిబ్బంది సర్వీస్ ను కూడా వినియోగించుకుంటున్నట్లు తెలిపారు.
ఈవీఎంలు 1,5,019(బీయు) 44,569(సీయు)లు,వీవీపాట్లు 48,134 అందుబాటులో ఉన్నాయని వికాస్ రాజ్ వివరించారు. ఈవీఎంలను మానిటరింగ్ చేయడానికి ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి ముగ్గరు చొప్పున ఈసీఐ ఎల్ ఇంజనీర్లను నియమించామన్నారు. పోలింగ్ కోసం 1.96 లక్షల మంది పోలింగ్ సిబ్బంది. 3,522 మంది సెక్టర్, అండ్ రూట్ ఆఫీసర్స్ నియమించామన్నారు. ఓటింగ్ కోసం రాష్ట్రంలో 35,809 పోలింగ్ స్టేషన్లు సిద్దం చేశామన్నారు. యాక్జిలరీ పోలింగ్ స్టేషన్లు 453 ఉన్నాయని తెలిపారు. మూడు అతిచిన్న పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, వీటిల్లో ఒక దాంట్లో 10, మరోదాంట్లో 12, ఇంకో దాంట్లె 14 మంది ఓటర్లున్నారన్నారు. కాగా 11 పోలింగ్ స్టేషన్లలో 25 మంది వరకు ఓటర్లు, 22 పోలింగ్ స్టేషన్లలో50 మంది వరకు ఓటర్లు, 54 పోలింగ్ స్టేషన్లలో100 మంది వరకు ఓటర్లున్నారని తెలిపారు.
ఎన్నికల ప్రక్రియను పరి:లించడానికి 12,909 మంది మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో 2.94 లక్షల మంది సిబ్బంది పాల్గొన్నట్లు వివరించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు బల్క్ ఎస్ ఎం ఎస్ లను నిషేధించినట్లు వికాస్ రాజ్ తెలిపారు.