వరంగల్‌లోని చారిత్రాత్మక వేయి స్తంభాల గుడిని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలెజినోవా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆలయంలోని విశేషాలను పరిశీలిస్తూ, భక్తిభావంతో పూజలు నిర్వహించారు. కాకతీయ రాజుల పాలనలో అద్బుత శిల్పకళతో నిర్మితమైన ఈ చారిత్రాత్మక ఆలయ ప్రాంగణంలో నంది విగ్రహం, మదనికలు సహా గుడిలోని శిల్పకళా చాతుర్యాన్ని తిలకించారు. ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి లెజినోవా అబ్బుర పడ్డారు. ఆలయంలో పలు ఫోటోలు దిగారు.
అన్నా లెజినోవా రష్యన్ జాతీయురాలైనప్పటికీ, హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలను ఎంతగానో ప్రేమిస్తారనడానికి ఈ పర్యటన మరో నిదర్శనంగా నిలిచింది. తరచూ ఆమె హిందూ ఆలయాలను దర్శిస్తు పూజలతో సందడి చేస్తుండటం ఆసక్తికరం. గతంలో ఆమె తిరుమ శ్రీవారికి తలనీలాలు కూడా సమర్పించడం విశేషం.
ఇవి కూడా చదవండి :
ఈ-సిగరెట్ ఎఫెక్ట్…రియాన్ పరాగ్ కు శిక్ష ఖరారు
వీడెక్కడి బౌలర్..ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఓ లుక్కెయ్యండి !
