MLC Kavitha | కవితపై ఈడీ సప్లిమెంటరీ చార్జిషీటుపై ముగిసిన వాదనలు.. 29న తీర్పు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటు పరిగణలోకి తీసుకోవడంపై రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి

  • By: Somu |    telangana |    Published on : May 21, 2024 6:01 PM IST
MLC Kavitha | కవితపై ఈడీ సప్లిమెంటరీ చార్జిషీటుపై ముగిసిన వాదనలు.. 29న తీర్పు

విధాత: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటు పరిగణలోకి తీసుకోవడంపై రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. అర్డర్‌ను ట్రయల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఈనెల 29వ తేదీకి రిజర్వ్ చేశారు. కవిత సహా దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ ప్రీత్ లపై ఇటీవల ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులకు సంబంధించిన అన్ని వివరాలు చార్జిషీట్ లో ఉన్నాయని ఈడీ పేర్కొంది.