తెలంగాణలో మళ్లీ సీఎం కేసీఆర్ ప్రభుత్వమే: అసదుద్ధీన్

తెలంగాణలో మళ్లీ సీఎం కేసీఆర్ ప్రభుత్వమే: అసదుద్ధీన్

విధాత : తెలంగాణలో మూడో సారి కూడా సీఎం కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తాము అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఒవైసీ తెలిపారు. తమ పార్టీ పోటీ చేసే ప్రతిచోటా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. రాజస్థాన్‌లో ఇప్పటికే తమ పార్టీ తరుపున ముగ్గురు అభ్యర్థులను ప్రకటించామన్నారు.