Nagarkurnool | కూలీలపై అఘాయిత్యం.. ఇద్దరు మహిళలపై లైంగిక దాడి
రోజు వారి కూలీలుగా పనిచేసే ఇద్దరు మహిళలకు ఇద్దరు వ్యాపారులు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని హాజీపూర్ గ్రామ సమీపంలో జరిగింది.

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో దారుణం
పోలీసుల అదుపులో నిందితులు
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: రోజు వారి కూలీలుగా పనిచేసే ఇద్దరు మహిళలకు ఇద్దరు వ్యాపారులు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని హాజీపూర్ గ్రామ సమీపంలో జరిగింది. అచ్చంపేట సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నియోజకవర్గంలోని బల్మూర్ మండల ప్రాంతానికి చెందిన (35) ఏళ్ల ఇద్దరు మహిళలు పొట్టకూటి కోసం నిత్యం అచ్చంపేట ప్రాంతంలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. అడ్డా మీద ఉన్న ఈ ఇద్దరు కూలీలను ఇంట్లో పని ఉందని అచ్చంపేట పట్టణంలోని టైల్స్ దుకాణ యజమాని వినోద్ సింగ్ (38), హైదరాబాదులో నివాసం ఉండే తన సన్నిహితుడు గజానంద్ (35)లు వారితో కూలీ పనులకు మాట్లాడుకున్నారు.
ఇంట్లో పనులు పూర్తి అయ్యాక ఇద్దరు మహిళలకు మద్యం తాగించారు. అనంతరం కారులో శ్రీశైలం..హైదరాబాద్ ప్రధాన రహదారి నుంచి ప్రయాణం చేసి డిండి వద్ద మరోసారి మద్యం తాగించారు. అనంతరం సాయంత్రం అచ్చంపేట మండలం హాజీపూర్ శివారులో కారులోనే మహిళలపై లైంగిక దాడి కి పాల్పడ్డారు. అనంతరం వారిని అచ్చంపేట పట్టణ కేంద్రంలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో విడిచి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నం చేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.