Mohammad Azharuddin minister| సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్
రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రిగా మహ్మద్ అజారుద్దీన్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా అజారుద్ధీన్ ఆక్టోబర్ 31న గవర్నర్ సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా బాధ్యతలు చేపట్టారు.
విధాత, హైదరాబాద్ : రాష్ట్ర(Telangana) మైనారిటీ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రిగా మహ్మద్ అజారుద్దీన్(Mohammad Azharuddin) సోమవారం పదవీ బాధ్యతలు(Took charge as minister) చేపట్టారు. ముస్లిం మత ప్రార్థనల మధ్య అజారుద్ధీన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అజార్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. మంత్రిగా అజారుద్ధీన్ ఆక్టోబర్ 31న గవర్నర్ సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్ధీన్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.
అజారుద్ధీన్ మంత్రివర్గంలో చేరడం ద్వారా ప్రస్తుతం సీఎం సహా మంత్రుల సంఖ్య 16కు చేరింది. మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అజారుద్ధీన్ ను మైనార్టీ కోటాలో మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆయనను గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రభుత్వం నామినేట్ చేసినప్పటికి..సంబంధిత ఫైల్ గవర్నర్ వద్ధ పెండింగ్ లో ఉంది. దీంతో మంత్రిగా అజారుద్దీన్ కొనసాగాలంటే..మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరునెలల వ్యవధిలో ఆయన ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాల్సి ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram