Azharuddin | మంత్రులుగా ప్ర‌మాణం చేసిన మాజీ క్రికెట‌ర్లు వీరే.. అజారుద్దీన్ ఎన్నో వ్య‌క్తి అంటే..?

Azharuddin | భార‌త మాజీ క్రికెట‌ర్, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ మ‌హ్మ‌ద్ అజారుద్దీన్( Azharuddin  )సీఎం రేవంత్ కేబినెట్‌( Revanth Cabinet )లో మంత్రిగా స్థానం సంపాదించుకున్నారు. ఇవాళ మంత్రిగా ప్ర‌మాణం చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో గ‌తంలో మాజీ క్రికెట‌ర్లు( Former Cricketers ) మంత్రులుగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారా..? మంత్రులుగా ప్ర‌మాణం చేసిన మాజీ క్రికెట‌ర్ల‌లో అజారుద్దీన్ ఎన్నో వ్య‌క్తి అనే విష‌యాల‌ను తెలుసుకుందాం.

  • By: raj |    telangana |    Published on : Oct 31, 2025 8:30 AM IST
Azharuddin | మంత్రులుగా ప్ర‌మాణం చేసిన మాజీ క్రికెట‌ర్లు వీరే.. అజారుద్దీన్ ఎన్నో వ్య‌క్తి అంటే..?

Azharuddin | భార‌త మాజీ క్రికెట‌ర్, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ మ‌హ్మ‌ద్ అజారుద్దీన్( Azharuddin  )సీఎం రేవంత్ కేబినెట్‌( Revanth Cabinet )లో మంత్రిగా స్థానం సంపాదించుకున్నారు. ఈ మేర‌కు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12.15 గంట‌ల‌కు అజారుద్దీన్ మంత్రిగా ప్ర‌మాణం చేయ‌బోతున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి రాజ్‌భ‌వ‌న్( Raj Bhavan ) వేదిక కానుంది. అజారుద్దీన్ ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు.

ఇక 2009 నుంచి కాంగ్రెస్ పార్టీ( Congress Party )లో కొన‌సాగుతున్న అజారుద్దీన్ తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly )లో అడుగు పెట్ట‌లేక‌పోయారు. కానీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మొర్దాబాద్( Moradabad ) నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక తెలంగాణ‌లో జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జూబ్లీహిల్స్( Jubilee hills ) నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేశారు. కానీ బీఆర్ఎస్ అభ్య‌ర్థి మాగంటి గోపీనాథ్( Maganti Gopinath ) చేతిలో ఓట‌మి పాల‌య్యారు. ఎట్ట‌కేల‌కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక( Jubilee Hills By Poll ) పుణ్య‌మా అని అజారుద్దీన్‌ను ఏకంగా మంత్రి ప‌ద‌వి వ‌రించింది. అయితే మంత్రి పదవిని పొందబోయే మొదటి క్రికెటర్ ఆయ‌న కాదు. మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోతున్న అజారుద్దీన్ మాజీ క్రికెట‌ర్ల‌లో ఐదో వ్య‌క్తి. ఇప్ప‌టి వ‌ర‌కు ఏయే మాజీ క్రికెట‌ర్లు మంత్రులుగా కొన‌సాగారో తెలుసుకుందాం.

నవజ్యోత్ సింగ్ సిద్ధూ( Navjot Singh Sidhu )

2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తూర్పు అమృత్ స‌ర్ నుంచి మాజీ క్రికెట‌ర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ పోటీ చేసి గెలుపొందారు. ఆ త‌ర్వాత పంజాబ్ ప్ర‌భుత్వంలో టూరిజం మినిస్ట‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. 2019లో సిద్ధూ మంత్రి ప‌ద‌విని కోల్పోయారు.

మనోజ్ తివారీ( Manoj Kumar Tiwary )

భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ 2021లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శివ్‌పూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. బెంగాల్ ప్రభుత్వంలో ఆయనకు క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పదవిని అప్పగించారు.

లక్ష్మీ రతన్ శుక్లా( Laxmi Ratan Shukla )

2016 ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆల్ రౌండ‌ర్ ల‌క్ష్మీ ర‌త‌న్ శుక్లా ఉత్త‌ర హౌరా స్థానం నుంచి పోటీ ప‌డి గెలుపొందారు. మ‌మ‌తా రెండోసారి సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ల‌క్ష్మీ ర‌త‌న్ శుక్లాను రాష్ట్ర క్రీడ‌లు, యువ‌జ‌న సేవా మంత్రిగా నియ‌మాకం అయ్యారు. లక్ష్మీ రతన్ శుక్లా 1999లో భారతదేశం తరపున 3 వన్డే మ్యాచ్‌లు ఆడారు.

మనోహర్ సిన్హ్‌ జడేజా ( Manoharsinh Jadeja )

మాజీ క్రికెట‌ర్ మనోహర్ సిన్హ్‌ జడేజా కాంగ్రెస్ ప్రభుత్వంలో గుజరాత్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆర్థిక మంత్రి, యువజన వ్యవహారాల మంత్రి, ఆరోగ్య మంత్రిగా జ‌డేజా సేవ‌లందించారు. జడేజా భారత జట్టుకు అరంగేట్రం చేయలేకపోయారు, కానీ 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 614 పరుగులు చేశారు. 5 వికెట్లు కూడా తీశారు.