రేవంత్‌ను కలిసిన భద్రాచలం బీఆరెస్‌ ఎమ్మెల్యే !

రేవంత్‌ను కలిసిన భద్రాచలం బీఆరెస్‌ ఎమ్మెల్యే ! కాంగ్రెస్‌లో చేరుతానని అనుచరులకు సందేశం

రేవంత్‌ను కలిసిన భద్రాచలం బీఆరెస్‌ ఎమ్మెల్యే !

విధాత : గెలిచిన కొన్ని గంటల్లోనే భద్రాచలం బీఆరెస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10స్థానాల్లో కాంగ్రెస్‌ 8, మిత్ర పక్షం సీపీఐ 1 స్థానం గెలుపొందగా, భద్రాచలంలో బీఆరెస్‌ తొలిసారిగా గెలిచింది.



 


ఈ జిల్లా నుంచి గెలిచిన ఒక్క బీఆరెస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రేవంత్‌రెడ్డిని కలిసిన నేపధ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరుతారని తన అనుచరులతో చెప్పి హైద్రాబాద్‌కు వచ్చినట్లుగా తెలుస్తుంది.