Bandi Sanjay | హైదరాబాద్ అంటే చార్మినార్ ఒక్కటే కాదు: బండి సంజయ్
మాజీ సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ హైదరాబాద్ అంటే చార్మినార్ అంటున్నాడని, ఆ మాటలు అతనికి మాత్రమే వర్తిస్తాయని, హైదరాబాద్ అంటే భాగ్యలక్ష్మి దేవాలయం అని, అదే విధంగా ప్రసిద్ధి చెందిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్
విధాత, హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ హైదరాబాద్ అంటే చార్మినార్ అంటున్నాడని, ఆ మాటలు అతనికి మాత్రమే వర్తిస్తాయని, హైదరాబాద్ అంటే భాగ్యలక్ష్మి దేవాలయం అని, అదే విధంగా ప్రసిద్ధి చెందిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అధికారిక చిహ్నం మార్పు ప్రయత్నాలపై ట్విటర్ వేదికగా స్పందించారు.
𝐏𝐫𝐚𝐣𝐚 𝐏𝐚𝐥𝐚𝐧𝐚 missing in Congress Government..!!
Was public opinion taken on deciding to change logo or altering state song?
There is no difference between BRS & Congress – both are resorting to diversion tactics instead of addressing real issues of grain procurement,…
— Bandi Sanjay Kumar (Modi Ka Parivar) (@bandisanjay_bjp) May 30, 2024
భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించకుండా కేటీఆర్‌ను అడ్డుకున్నది ఏమిటి.? అని బండి సంజయ్ కేటీఆర్‌ను ప్రశ్నించారు.తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన లేదని, అధికారిక చిహ్నం మార్చడంపై ప్రజాభిప్రాయం తీసుకున్నారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆరెస్, కాంగ్రెస్ మధ్య తేడా లేదని.. రెండూ ధాన్యం సేకరణ, ఎరువుల సరఫరా, విత్తనాల కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్ వంటి వాస్తవ సమస్యలను పరిష్కరించడానికి బదులుగా దారి మళ్లింపు వ్యూహాలను అవలంబిస్తున్నాయని ఆరోపించారు.