బాసింగ బలాలే ఫోక్ సాంగ్ షేకింగ్..తెలంగాణ ఫోక్ సాంగ్స్ పవర్ !

రాచరికపు కాలం నుంచి నేటీ ఏఐ సమాజం వరకు జానపద పాటలపై జనానికి మక్కువ తగ్గలేదు. సినిమా పాటలు..వెస్టర్న్ సాంగ్స్ వంటివి ఎన్ని వచ్చినా..ఫోక్ సాంగ్స్ కిక్కే వేరబ్బా అన్నట్లుగా జనం ఆ పాటల ఊపుకు ఊగిపోతుంటారు. ఇప్పుడు కొత్తగా బాసింగ బలాలే బలుగున్నాయే..అంటూ సాగే ఓ కొత్త ఫోక్ సాంగ్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో జానపద పాటలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రాచరికపు కాలం నుంచి నేటీ ఏఐ సమాజం వరకు జానపద పాటలపై జనానికి మక్కువ తగ్గలేదు. సినిమా పాటలు..వెస్టర్న్ సాంగ్స్ వంటివి ఎన్ని వచ్చినా..జానపదాల పాటల కిక్కే వేరబ్బా అన్నట్లుగా జనం ఆ పాటల ఊపుకు ఊగిపోతుంటారు. ఫోక్ సాంగ్స్ పుణ్యమా అని మట్టి మాణిక్యాల వంటి ఎందరో ప్రతిభావంతులైన కవి, గాయకులు సమాజానికి పరిఛయం అవుతుండగా..వారిలో కొందరు సెలబ్రెటీలు కూడా మారిపోతున్నారు.

ప్రస్తుతం అచ్చమైన తెలంగాణ పల్లెటూరి యాస, భాషలతో, మాస్ బీట్‌లతో ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. సోషల్ మీడియా, యూ ట్యూబ్ ల చలవతో నిత్యం ఏదోక ఫోక్ సాంగ్ నెట్టింట సందడి చేస్తుంది. మొన్నటి వరకు రాను బొంబాయికి రాను అనే పాట అందరిని స్టెప్పులేయించింది. ఆ తర్వాత ‘ఓ పిలగ యెంకటేశు పాట’, ‘పేరుగల్ల పెద్దిరెడ్డి, బాయిలోనా బల్లిపలికే పాటలకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.శెనగ చేల నిలబడి చేతులైయ్యావే పిల్ల, అలాగే ప్రమీల సాంగ్, “ఎర్ర ఎర్ర రుమాల్ గట్టి వంటి పాటలు మిలియన్స్ వ్యూస్ సాధించి సత్తా చాటాయి.

ఇప్పుడు మరో కొత్త ఫోక్ సాంగ్ నెట్టింట దుమ్మురేపుతుంది. ఆ పాటలపై ఇన్ స్టాలో రీల్స్ వైరల్ గా మారాయి. జానపద పాటలకు ఇన్ స్టాలో చిన్న, పెద్ద అందరూ డ్యాన్స్ చేస్తూ, రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవల “చికేనే తెత్తడో నా అల్లుడు.. లేక మటనే తెత్తడో నా అల్లుడు.. బీరే తెత్తడో నా అల్లుడు లేక క్వార్టరే తెత్తడో నా అల్లుడు” అంటూ మరో ఫోక్ సాంగ్ ఊపేసింది.

ఇప్పుడు కొత్తగా బాసింగ బలాలే బలుగున్నాయే..అంటూ సాగే ఓ కొత్త ఫోక్ సాంగ్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఈ పాటను పాడిన గాయకుల ప్రతిభ..పాటలోని సాహిత్యం, సంగీతం తెలంగాణ ఫోక్ సాంగ్ పవర్ ఎంతో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం అంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు. మరి మీరు కూడా.. బాసింగ బలాలే.. పాట బలం ఎంటో తెలుసుకునేందుకు ఆ పాటను వినేయండి మరి.

 

Latest News