దేశంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది : భట్టి విక్రమార్క
దేశంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ అన్నారు .శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కేంద్రం లోని సుభాష్ చౌరస్తా లో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ జరిగింది.

-వనపర్తి సెగ్మెంట్ కు 3వేల 500 ల ఇందిరమ్మ ఇళ్లు.
-కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇచ్చిన సీపీఎం కు ధన్యవాదాలు.
-మల్లు రవి కి ఓటు వేసి గెలిపించండి.
-ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
విధాత వనపర్తి బ్యూరో : దేశంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ అన్నారు .శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కేంద్రం లోని సుభాష్ చౌరస్తా లో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గానికి 3వేల 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్న సిపిఎం నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.10 సంవత్సరాలు బానిసత్వ బతుకు బతికామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే స్వేచ్ఛ, స్వాతంత్రం వచ్చిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తే వ్యవసాయ రంగానికి సాగు నీరు వస్తాయని భావించామని, రైతుల కంట ఆనందాన్ని చుస్తామనుకున్నాం, కానీ పదేళ్లు అయన బీఆర్ ఎస్ పార్టీ ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేదన్నారు .
ఓబీసీ లను దామాషా ప్రకారంగా అందరినీ ఆదుకుంటామన్నారు. జనాభా కుల గణన కోసం సర్వం సిందం చేశామన్నారు. వనపర్తి తాలూకా కు 3 వేల 500ఇండ్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. మహిళల కు వడ్డీలేని రుణాలను రూ: 272 కోట్ల చొప్పున అమలు చేశామన్నారు. 10 సంవత్సరాల బీఆర్ ఎస్ పాలనలో ఏమి సాధించారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి నాలుగు నెలలు అయ్యిందని, అంత లోపే నష్టం జరిగిందని కేసీఆర్ అనడం సిగ్గు చేటన్నారు. దేశవ్యాప్తంగా ఇందిరమ్మ రాజ్యం రాబోతుందన్నారు. నిరుపేద మహిళలకు సంవత్సరానికి లక్ష అకౌంట్ లో వేసి ఆదుకుంటామని ఆయన చెప్పారు. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి, తూడి శ్రీనివాస్ రెడ్డి, ధనలక్ష్మి, విష్ణు వర్దన్ రెడ్డి, లక్కాకుల సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.