విధాత, హైదరాబాద్ : తనకు రావాల్సిన 40లక్షల బిల్లు కోసం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క భార్య 10శాతం కమిషన్ అడిగారని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ప్రభుత్వం నుండి బిల్లు రావాలి అంటే బిల్లును బట్టి 5శాతం నుంచి 10శాతం కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని ఆ ఉద్యోగురాలు ఆరోపించింది.
మెడికల్ ఆండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో తాను 2020లో రిటైరయ్యానని, తనకు 40లక్షల బిల్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. బిల్లు కోసం భట్టి విక్రమార్క భార్య వద్దకు వెళితే 10శాతం అడిగారని ఆమె ఆరోపించారు. పర్సెంటేజీలు ఇచ్చిన వారికే బిల్లులు పాస్ అవుతున్నాయని వాపోయారు. ప్రభుత్వం రిటైర్డు ఉద్యోగాలకు ప్రతినెల 200కోట్ల నుంచి 700కోట్ల మేరకు విడుదల చేస్తున్నామని చెబుతున్నారని..వాస్తవానికి ఉద్యోగులకు మాత్రం పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడం లేదని బాధిత ఉద్యోగిని ఆరోపించారు.
40లక్షలు bill ki 10% అడిగింది బట్టి విక్రమార్క గారి భార్య – రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి
ప్రభుత్వం నుండి బిల్లు రావాలి అంటే 10% 8% 5% ఇవ్వాల్సిందే అంటే
over to @Bhatti_Mallu @TelanganaCMO pic.twitter.com/U0JetmI4Gm
— Saibaba Kotla_NRIBRS (@saibabakotla) August 8, 2026
