కాంగ్రెస్ లో చేరిన బీజేపీ మాజీ కౌన్సిలర్

నల్గొండ కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. సోమవారం బీజేపీ మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

కాంగ్రెస్ లో చేరిన బీజేపీ మాజీ కౌన్సిలర్

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నల్గొండ కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. సోమవారం బీజేపీ మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ అవతరించబోతున్నదని కోమటిరెడ్డి ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు