సచివాలయం ముందు బీజేపీ మహిళా మోర్చా నిరసన.. అడ్డుకున్న పోలీసులు
తెలంగాణ సచివాలయం ముందు బీజేపీ మహిళా మోర్చా చేపట్టిన నిరసన కార్యక్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య సాగిన తోపులాటతో ఉద్రిక్తతకు దారితీసింది

విధాత, హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం ముందు బీజేపీ మహిళా మోర్చా చేపట్టిన నిరసన కార్యక్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య సాగిన తోపులాటతో ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులను ఖండిస్తూ, తెలంగాణలో మహిళలకు భద్రత కరువైందని… నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా బుధవారం సచివాలయం వద్ద నిరసనకు దిగింది. ఆందోళనకారులు సచివాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్న సందర్భంలో ఇరువర్గాల మధ్య తోపులాట సాగింది.
పోలీసులు మహిళా మోర్చా నేతలను అదుపులోకి తీసుకుని తరలించే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా నాయకుల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో నేరాలు పెరిగిపోయాయని, మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడే కీలకమైన హోంశాఖ మంత్రి పదవి నేటికి ఖాళీగా ఉండటం విడ్డూరంగా ఉందని.. మహిళల భద్రతను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.