Dharmapuri Arvind | ఐ విల్ మిస్ యూ డ్యాడీ.. ధర్మపురి అరవింద్ భావోద్వేగ పోస్టు
Dharmapuri Arvind | తండ్రి మృతి పట్ల డీఎస్ కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోషల్ మీడియా వేదికగా ఆయన స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఐ విల్ మిస్ యూ డ్యాడీ అంటూ ధర్మపురి అరవింద్ భావోద్వేగ పోస్టు పెట్టారు.
Dharmapuri Arvind | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) గుండెపోటుతో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తండ్రి మృతి పట్ల డీఎస్ కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోషల్ మీడియా వేదికగా ఆయన స్మృతులను గుర్తు చేసుకున్నారు.
“అన్నా..అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. I WILL MISS YOU DADDY ! నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే.! ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే.. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా..! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు ఎప్పటికీ నా లోనే ఉంటావు.” అంటూ సోషల్ మీడియా వేదికగా ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram