టీజీపీఎస్పీ ముందు బీజేవైఎం ధర్నా.. కార్యకర్తల అరెస్టు
గ్రూప్ ఉద్యోగాలను పెంచాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం టీజీపీఎస్పీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు

విధాత, హైదరాబాద్ : గ్రూప్ ఉద్యోగాలను పెంచాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం టీజీపీఎస్పీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని, 25 వేల టీచర్ పోస్టుల భర్తీకోసం మెగా డీఎస్సీని నిర్వహించాలని, జాబ్ క్యాలండర్ విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నినాదాలతో హోరెత్తించారు. ధర్నా చేస్తున్న ఆందోళన కారులు టీజీపీఎస్పీ కార్యాలయంలో లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేవైఎం కార్యకర్తలు, నాయకుల మధ్య తోపులాట సాగింది. అరెస్టు చేసిన నాయకులను, కార్యకర్తలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బిజెవైఎం ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవన్ ఎదుట ధర్నా, అడ్డుకున్న పోలీసులు. బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షులు @mahendersevalla సహా అరెస్టయిన బిజెవైఎం నాయకులు, కార్యకర్తలు. (2/2)#CongressFailsTelanga
— BJYM Telangana (@BJYMinTG) June 22, 2024