Praja Bhavan | ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు.. 10 నిమిషాల్లో పేలుతుందని హెచ్చరిక
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ప్రజా భవన్‌లో బాంబు ఉందంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు.
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ప్రజా భవన్‌లో బాంబు ఉందంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. పది నిమిషాల్లో బాంబు పేలుతుందని అగంతకులు హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు ప్రజా భవన్ సిబ్బందికి సమాచారం అందించారు.
ఈ క్రమంలో ప్రజా భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రజా భవన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. ప్రజా భవన్ ఆవరణలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసం ఉంటున్నారు. కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్‌గా కొనసాగిన ఈ భవనానికి సీఎం రేవంత్ అయ్యాక ప్రజా భవన్‌గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram