ఇటీవల అకస్మిక మరణానికి గురైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది దర్శన్ రెడ్డి కుటుంబానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ తరఫున 2కోట్ల 25 లక్షల రూపాయల సహాయాన్ని అందించాలని నిర్ణయించారు. కేసీఆర్ పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సహాయంల భాగంగా సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు.
అదే సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున వారి బాగోగుల కోసం మరో 25 లక్షలు రూపాయలను తల్లి పేరు మీద బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.
ఇంతటితోనే కాకుండా పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు.పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మల కార్యక్రమాలు ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చొని వారి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారనీ, ఎల్లకాలం వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
