అది లిక్క‌ర్ స్కాం కానే కాదు.. అది మోదీ పొలిటిక‌ల్ స్కీం : కేసీఆర్

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అది లిక్క‌ర్ స్కాం కానే కాదు.. అది మోదీ పొలిటిక‌ల్ స్కీం అని తేల్చిచెప్పారు కేసీఆర్. టీవీ9 బిగ్ డిబేట్‌లో ఢిల్లీ లిక్క‌ర్ స్కాంపై కేసీఆర్ మాట్లాడారు.

  • Publish Date - April 23, 2024 / 10:29 PM IST

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అది లిక్క‌ర్ స్కాం కానే కాదు.. అది మోదీ పొలిటిక‌ల్ స్కీం అని తేల్చిచెప్పారు కేసీఆర్. టీవీ9 బిగ్ డిబేట్‌లో ఢిల్లీ లిక్క‌ర్ స్కాంపై కేసీఆర్ మాట్లాడారు.

లిక్క‌ర స్కాం బోగ‌స్ అది మోదీ సృష్టి. అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు లిక్క‌ర్ పాల‌సీలు ఉంటాయి. లిక్క‌ర్ స్కాంలో నా కూతురు క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌కు వ‌స్తది. ఆమెకు ఆ కేసుతో సంబంధం లేదు. ఆమెకు ఆ కేసు తెలియ‌దు. విట్‌నెస్ కింద విచార‌ణ అన్నారు. ఇవాళ అప‌రాధి అంటున్నారు. మూడేండ్ల నుంచి అదే ప్ర‌శ్న‌. ఒక్క రూపాయి రిక‌వ‌రీ లేదు. ఢిల్లీ సీఎంను తీసుకోనిపోయి జైల్లో పెట్టారు. ఈ కేసులో క‌విత‌, కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వ‌డం లేదు. సీఎం, ఎమ్మెల్సీగా ఉన్న వీరికి బెయిల్ ఇవ్వ‌రా..? వారు ఏమైనా పారిపోతారా..? ఈ దేశంలో ఏం జ‌రుగుతుంది. ఢిల్లీ స్కాం లేనే లేదు. ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌ను అడ్డం పెట్టుకుని అన‌వ‌స‌రంగా అమాయుకుల‌ను శిక్షిస్తున్నారు. న‌రేంద్ర మోదీ ఓ దుకాణం ఓపెన్ చేసి 700 మంది ప్ర‌జాప్ర‌తినిధుల‌ను గుంజుకున్నారు. చాలా ప్ర‌భుత్వాల‌ను కూల్చి బీజేపీ ఏలింది. అందులో భాగంగా తెలంగాణ‌కు వ‌చ్చి ఎమ్మెల్యేల‌ను కొనే ప్ర‌య‌త్నం చేశారు. మేం ఫైట‌ర్స్ కాబ‌ట్టి, వారిని ధైర్యంతో ప‌ట్టుకుని జైల్లో వేశాం. ఈ వ్య‌వ‌హారంలో బీఎల్ సంతోష్ ప్ర‌ధాన సూత్ర‌ధారి. బీఎల్ సంతోష్‌పై కేసు పెట్ట‌మాని చెప్పి నా కూతురిపై కేసు పెట్టారు. ఎన్నిక‌ల‌కు ముందు క‌విత‌ను నిర్బంధించి కేసీఆర్‌ను అపఖ్యాతి చేసేందుకు ప‌న్నాగం చేశారు. ఘోర‌మైన పాప‌కృత్యం మోదీ చేశారు. అది స్కాం కానే కాదు.. అది మోదీ పొలిటిక‌ల్ స్కీం. అమాయ‌కుల‌ను అరెస్టు చేసి వేధిస్తున్నారు అని కేసీఆర్ ధ్వ‌జమెత్తారు.

Latest News