ఈ నెల 24 నుంచి మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో.. రూట్ మ్యాప్ విడుద‌ల‌

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి రూప‌క‌ల్ప‌న చేశారు. ఈ క్ర‌మంలో రోడ్ షో నిర్వ‌హించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు రోడ్ షో రూట్‌మ్యాప్‌ను బీఆర్ఎస్ పార్టీ శ‌నివారం రాత్రి విడుద‌ల చేసింది.

  • Publish Date - April 20, 2024 / 11:39 PM IST

హైద‌రాబాద్ : లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి రూప‌క‌ల్ప‌న చేశారు. ఈ క్ర‌మంలో రోడ్ షో నిర్వ‌హించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు రోడ్ షో రూట్‌మ్యాప్‌ను బీఆర్ఎస్ పార్టీ శ‌నివారం రాత్రి విడుద‌ల చేసింది.

మిర్యాల‌గూడ నుంచి కేసీఆర్ రోడ్ షో ఈ నెల 24వ తేదీన ప్రారంభం కానుంది. 17 రోజుల పాటు కేసీఆర్ రోడ్ షో కొన‌సాగ‌నుంది. 12 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో కేసీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు. మే 10వ తేదీన సిద్దిపేట‌లో కేసీఆర్ రోడ్ షో ముగియ‌నుంది. రోడ్ షోల్లో భాగంగా కార్న‌ర్ మీటింగ్స్, బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

Latest News