BRS MLA | బీఆర్‌ఎస్ నుంచి ఆగని వలసలు.. నేడు కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే..!
BRS MLA | బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ పార్టీ బాట పడుతున్నారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

BRS MLA : బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ పార్టీ బాట పడుతున్నారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు గ్రేటర్‌లోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి హస్తం పార్టీలో చేరుతున్నారు.
ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా ఆ సంఖ్య మరింత పెరుగుతోంది. నిన్న (శుక్రవారం) బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. నేడు మరో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు ఇంతటితో కూడా ఆగేలా లేవు. మరికొంత మంది కూడా బీఆర్‌ఎస్‌ను వీడిన వారి బాటలోనే నడిచే అవకాశం ఉంది.
ఈరోజు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గాంధీ కాంగ్రెస్ పండువా కప్పుకోనున్నారు. జూబ్లిహిల్స్‌లోని సీఎం నివాసంలో ఎమ్మెల్యే గాంధీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అరికపూడి గాంధీతోపాటు పలువురు కార్పోరేటర్లు, నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రేపు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావు కూడా కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.