Palla Rajeshwar Reddy | రైతులను మాయ చేస్తున్న సీఎం, మంత్రులు … ప్రశ్నించిన బీఆరెస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ముఖ్యమంత్రి, మంత్రులు గత నాలుగైదు రోజులుగా రైతులను మాయ చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు కె .పి .వివేకానంద ,కోవా లక్ష్మి ,బీ ఆర్ ఎస్ నేతలు రాకేష్ రెడ్డి ,రాం బాబు యాదవ్ ,తుంగ బాలు లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశం

లక్ష లోపు రుణాలు 19 వేల కోట్ల నుంచి 6 వేల కోట్లకు ఎలా తగ్గింది
రైతు భరోసా ఎందుకు వేయడం లేదు
విధాత: ముఖ్యమంత్రి, మంత్రులు గత నాలుగైదు రోజులుగా రైతులను మాయ చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు కె .పి .వివేకానంద ,కోవా లక్ష్మి ,బీ ఆర్ ఎస్ నేతలు రాకేష్ రెడ్డి ,రాం బాబు యాదవ్ ,తుంగ బాలు లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్ష లోపు రుణాల మొత్తం కేసీఆర్ హయం లో 19 వేల కోట్లు ఉంటే ఇపుడు 6 వేల కోట్ల కు ఎలా తగ్గింది ..ఎవర్ని మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆంక్షల పేరిట రేవంత్ సర్కారు రైతుల రుణ మాఫీ ని కొందరికే పరిమితం చేసిందని ఆరోపించారు. రైతు భరోసా ఎందుకు వేయలేదని అడిగారు.ఇంకా డ్రామాలు ఎందుకు చేస్తున్నారన్నారు. మంత్రులకు వాస్తవాలు తప్ప అన్నీ వస్తున్నాయన్నారు. రైతులు కూడా టాక్స్ పేయర్స్ యే అని, రైతులను కించపరిచేలా మంత్రులు మాట్లాడొద్దన్నారు. కాంగ్రెస్ నేతల మొహం లోనే ఆనందం కనిపిస్తుంది తప్ప రైతుల మొహం లో లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు.
రైతులకు అంతా మేమే చేశామని, కేసీఆర్ హయం లో ఏం జరగలేదన్నట్టుగా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ వాళ్ళ అబద్దాలు చూసి గోబెల్స్ బతికి ఉంటె ఆత్మహత్య చేసుకునే వారన్నారు. ఈ ప్రభుత్వం రైతుల రుణ మాఫీ కోసం విడుదల చేసింది 6 వేల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసిందని, ఇది రుణాలున్న రైతుల్లో 30 శాతం, డబ్బుల పరంగా చూస్తే 20 శాతం మాత్రమేనన్నారు. సీఎం చెబుతున్న లెక్కల ఆధారంగానే మేము మాట్లాడుతున్నామని, రైతులకు కాంగ్రెస్ చేసింది గోరంత కానీ కొండంతలుగా గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ హయం లో మొదటి విడతలో 35 చేసి, రెండో విడత లో 19 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీకి సిద్ధంగా ఉంచుకుని 12 వేల కోట్లు చెల్లించామన్నారు. కాంగ్రెస్ ఈసీ కి చేసిన పిర్యాదు తో రూ. 7 వేల కోట్లు చెల్లించకుండా మిగిలి పోయాయన్నారు. ఆ ఏడు వేల కోట్లు మంత్రుల కాంట్రాక్టు సంస్థలకు వెళ్లాయని ఆరోపించారు.