BRS MLA’S Met Speaker : అసెంబ్లీలో మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాన్స్ ఇవ్వాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై PowerPoint ప్రజెంటేషన్ చేసేందుకు స్పీకర్‌ను కలిసి వినతి తెలిపారు.

BRS MLA’S Met Speaker | విధాత, హైదరాబాద్ : రేపు శనివారం నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ద్వారా వివరించే అవకాశాన్ని బీఆర్ఎస్ ఎల్పీకి కల్పించాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు వినతిపత్రం అందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ. వివేకానంద, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం. రమేష్ కుమార్ రెడ్డిలు శాసనసభ స్పీకర్‌ను కలిసిన ఈ మేరకు వినతి పత్రం అందించారు.
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేసే వాదనను తిప్పికొట్టే క్రమంలో మా పార్టీ ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాన్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎల్పీ కోరడం గమనార్హం.