ఏసీబీ వలలో మరో అధికారి.. లంచం సొమ్ముతో చిక్కిన డిప్యూటీ తహశీల్ధార్
తెలంగాణలో ఏసీబీ జోరు కొనసాగుతుంది. చర్ల మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్ధార్ బీరవెల్లి భరణి బాబు రైతు నుంచి 20వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కారు.
విధాత: తెలంగాణలో ఏసీబీ జోరు కొనసాగుతుంది. చర్ల మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్ధార్ బీరవెల్లి భరణి బాబు రైతు నుంచి 20వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కారు. కొత్తపల్లి అనుబంధ గ్రామమైన దండుపేటకు చెందిన కర్ల రాంబాబు పాసు పుస్తకం కోసం డిప్యూటీ తహశీల్దార్ భరణి బాబును ఆశ్రయించాడు. అయితే, పాసు పుస్తకం కావలంటే తనకు రూ.50 వేలు లంచంగా ఇవ్వాలంటూ భరణి డిమాండ్ చేశాడు.
దీనిపై విసుగెత్తిన రాంబాబు ఏసీబీని ఆశ్రయించగా, ఏసీబీ ప్రణాళిక మేరకు గురువారం భరణి బాబుకు రైతు రాంబాబు రూ.20 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ అదుపులోకి తీసుకున్నారు. గతంలో బూర్గంపాడులో పనిచేస్తున్న సమయంలోనూ కూడా ట్రాక్టర్ యజమానుల నుండి లంచం ఆశించి పట్టుబడిన భరణి రెండవ సారి లంచం సొమ్ముతో పట్టుబడటం గమనార్హం. బుధవారం తెలంగాణలో నిర్మల్ జిల్లా భైంసాలో ఇంటి నిర్మాణ అనుమతుల కోసం లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్‌లు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram