Chevella Bus Accedent | ఫలితమీయని లక్కీ నెంబర్ 9
వాహనాల నంబర్లో 9 లేదా అన్ని అంకెలు కూడితే తొమ్మిది సంఖ్య వస్తే లక్ అని భావించేవారు ఉన్నారు. అయితే.. చేవెళ్ల ప్రమాదంలో రెండు వాహనాల నెంబర్లు దేన్ని కూడినా తొమ్మిదే వస్తున్నది.
ఏదైనా కొత్త వాహనాలు కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ మొత్తం కూడితే 9 వస్తే బాగుంటుందని 90 శాతం మంది భావిస్తుంటారు. అయితే ఈరోజు చేవెళ్ల తాండూర్ మధ్య ప్రమాదానికి గురై 24 మంది మరణానికి కారణమైన ఆర్టీసీ బస్సు.. టిప్పర్ లారీల నెంబర్లు తెలిస్తే ఇక లక్కీ నెంబర్ 9 అంటే ఎందుకూ పనికి వచ్చేది కాదని, కేవలం ఫ్యాషన్ కోసమే వాడుకోవాల్సి ఉంటుందని భావించాల్సిందే. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు నెంబర్ 6354=9, అలాగే టిప్పర్ నెంబర్ 3879=9. రెండు వాహనాల నెంబర్ కూడా కూడితే 9 నెంబర్ వస్తుంది.. వాహనాల నెంబర్లు 9 లక్కీ అయినప్పుడు ప్రమాదం ఎలా జరిగిందనేది ఇక్కడ ప్రశ్న.. అందుకే మూఢనమ్మకాలకు వెళ్లకుండా వచ్చిన నెంబర్ ఏదో ఒకటి సంతృప్తిగా తీసుకొని ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram