Chevella Bus Accedent | చేవెళ్ల బస్సు ప్రమాదం పై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్​ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.

  • By: Tech |    hyderabad |    Published on : Nov 03, 2025 9:59 AM IST
Chevella Bus Accedent | చేవెళ్ల బస్సు ప్రమాదం పై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

Chevella Bus Accedent | చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన 24 మంది కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ కార్యాలయం ట్విట్టర్లో వెల్లడించింది.

ప్రమాదంపై సీఎం రేవంత్​ రెడ్డి దిగ్భ్రాంతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్​ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశించారు.

ప్రమాద ఘటనకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభాకర్ బయలుదేరారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డు సరిగా లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందంటూ స్థానికులు ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్థానికుల నుంచి నిరసన ఎదుర్కొన్నారు.

ప్రమాదంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ లు విచారణ వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్ లు డిమాండ్ చేశారు.