చేవెళ్ల బస్సు ప్రమాద సహాయక చర్యల్లో అపశృతి.. సీఐకి గాయాలు.. 24కు పెరిగిన మృతులు

ఈ రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు 24 మంది ప్రయాణికులు మృతి చెందగా మరో 24మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది.

  • By: Tech |    hyderabad |    Published on : Nov 03, 2025 10:12 AM IST
చేవెళ్ల బస్సు ప్రమాద సహాయక చర్యల్లో అపశృతి.. సీఐకి గాయాలు.. 24కు పెరిగిన మృతులు

విధాత: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన టిప్పర్ లారీ.. బస్సు ఢీకొన్న ప్రమాదంలో సహాయక చర్లలో నిమగ్నమైన చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ కు గాయాలయ్యాయి. బస్సు పై పడిన టిప్పర్ లారీ కంకరను జెసిబి తొలగిస్తున్న క్రమంలో సీఐ కాలు మీద నుండి జెసిబి వెళ్లడంతో ఆయన గాయపడ్డారు. వెంటనే పోలీస్ సిబ్బంది ఆయనను ఆసుపత్రి కి తరలించారు.

ఈ రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు 24 మంది ప్రయాణికులు మృతి చెందగా మరో 24మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది.

రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడంతోనే ఈ మార్గంలో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చేవెళ్ల బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి.. మృతులకు ఎక్స్‌గ్రేషియా

చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన 24 మంది కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ కార్యాలయం ట్విట్టర్లో వెల్లడించింది.