మనిషి మాట వింటున్న కోడి … కడకనాథ్ కోడి మాయ

ఓ కోడి మనిషి మాట వింటూ పెంపుడు జంతువు మాదిరిగా వ్యవహారిస్తుంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన ఎనమల మల్లారెడ్డి అనే వ్యక్తికి కోళ్లఫారం ఉంది. అందులో 200కడక్ నాథ్ కోళ్లను పెంచుతున్నాడు

మనిషి మాట వింటున్న కోడి … కడకనాథ్ కోడి మాయ

విధాత, హైదరాబాద్ : ఓ కోడి మనిషి మాట వింటూ పెంపుడు జంతువు మాదిరిగా వ్యవహారిస్తుంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన ఎనమల మల్లారెడ్డి అనే వ్యక్తికి కోళ్లఫారం ఉంది. అందులో 200కడక్ నాథ్ కోళ్లను పెంచుతున్నాడు. అందులో ఓ కడక్ నాథ్ కోడి మల్లారెడ్డి పట్ల ప్రేమ పెంచుకుని ఆయన మాటను వింటూ చెప్పింది చేస్తూ అందరిని విస్మయానికి గురి చేస్తుంది. మల్లారెడ్డి ముందుకు వెళ్లమంటే ముందుకు.. వెనక్కు వెళ్లమంటే వెనక్కి వెళ్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. కడకనాథ్‌ జాతికి చెందిన ఈ కోడి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ కోడి నేనంటే ప్రేమ పెంచుకుందని, ఎప్పుడు నా చుట్టు తిరుగుతూ నా చేతులపైన, భుజాలపైన కూర్చుంటూ నా మాటలు విని నేను పెట్టేది తింటూ చెప్పింది చేస్తుందని మల్లారెడ్డి వెల్లడించారు. ఈ కడక్ నాథ్ కోడి వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.