C.M. REVANTH REDDY | ప్లే స్కూల్ తరహాలో అంగన్ వాడీ కేంద్రాలు … విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీ కేంద్రాలలోనే విద్యాబోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖ కార్యదర్శిబుర్రా వెంకటేశంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

అంగన్ వాడీ కేంద్రానికి ఒక టీచర్
4వ తరగతి నిం సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్
స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు ఉచిత ప్రయాణం
మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలు పటిష్టం చేయాలి
తగిన ప్రణాళికలు రూపొందించండి
విధాత: ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీ కేంద్రాలలోనే విద్యాబోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖ కార్యదర్శిబుర్రా వెంకటేశంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. . ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మాస్టర్ ప్లాన్, ఇతర అంశాలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి అధికారులు, ఆర్కిటెక్చర్లతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్ వాడీలలో విద్యాబోధనకు అదనంగా ఒక టీచర్ నియమించేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. 3వ తరగతి వరకు అంగన్ వాడీ కేంద్రాల్లో ఆతరువాత 4వతరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. గ్రామాల నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణ సదుపాయం కల్పించచాలని తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల తో సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ ను కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని సూచించారు. విద్యా వేత్తల అభిప్రాయాలు తీసుకున్నాక కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిధులతోపాటు సీఎస్ఆర్ ఫండ్స్ తో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రేవంత్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ మేరకు వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.