అమిత్ షా ఫేక్ వీడియోతో నాకు సంబంధం లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
రిజర్వేషన్ల రద్దు అంశంపై అమిత్ షా ఫేక్ వీడియో షేర్ చేయడంలో నాకు సంబంధం లేదని తెలంగాణ సీఎం రేవంత్‌డ్డి ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపించారు

ఢిల్లీ పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం
విధాత : రిజర్వేషన్ల రద్దు అంశంపై అమిత్ షా ఫేక్ వీడియో షేర్ చేయడంలో నాకు సంబంధం లేదని తెలంగాణ సీఎం రేవంత్‌డ్డి ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపించారు. కాంగ్రెస్ తెలంగాణ ట్విట్టర్ ఎక్స్ ఖాతా నేను నిర్వహించడం లేదని, సీఎంఓ తెలంగాణ, నా వ్యక్తిగత ఖాతాలు మాత్రమే నేను వినియోగిస్తున్నానని తన సమాధానంలో స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు తన తరపు లాయర్ ద్వారా రేవంత్‌రెడ్డి సమాధానం పంపించారు. నిజానికి అమిత్ షా ఫేక్ వీడియోకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి సహా, పార్టీ సోషల్ మీడియా నిర్వాహకులు ఢిల్లీలో విచారణకు హాజరుకావాల్సివుంది. అయితే నోటీసులకు సమాధానం కోసం వారు 15రోజుల సమయం కోరారు. అంతకముందే బుధవారం రోజునే సీఎం రేవంత్‌రెడ్డి తన సమాధానాన్ని ఢిల్లీ పోలీసులకు పంపించారు.