సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఈ నెల 26న హైదరాబాద్ శివారులోని ఓ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో 50మంది ప్రాణాలు కాపాడిన సాహస బాలుడు సాయిచరణ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించి సన్మానించారు

సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి

విధాత : ఈ నెల 26న హైదరాబాద్ శివారులోని ఓ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో 50మంది ప్రాణాలు కాపాడిన సాహస బాలుడు సాయిచరణ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించి సన్మానించారు. ఆదివారం జూబ్లిహీల్స్‌లోని తన నివాసంలో సాయిచరణ్‌ను రేవంత్‌రెడ్డి సన్మానించి అభినందించారు. అగ్నిప్రమాద వేళ సమయస్ఫూర్తితో సాహసంతో వ్యవహరించి ఆరుగురి ప్రాణాలు కాపాడిన సాయిచరణ్ తెగువ స్ఫూర్తిదాయకమని, ఆయనకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామకు చెందిన 15ఏళ్ల సాయిచరణ్ ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడు.