Paris Olympics 2024 | ఒలంపిక్ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోన్న తెలంగాణ అథ్లెట్స్ .. ఫోన్ చేసి అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

పారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడల్లో ఆయా కేటగిరీల తొలి దశల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోన్న తెలంగాణ అథ్లెట్స్ నిఖత్ జరీన్(బాక్సింగ్), శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), పీవీ సింధు (బ్యాడ్మింటన్) లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.

  • By: Subbu |    telangana |    Published on : Jul 29, 2024 5:30 PM IST
Paris Olympics 2024 |  ఒలంపిక్ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోన్న తెలంగాణ అథ్లెట్స్ .. ఫోన్ చేసి అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

విధాత: పారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడల్లో ఆయా కేటగిరీల తొలి దశల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోన్న తెలంగాణ అథ్లెట్స్ నిఖత్ జరీన్(బాక్సింగ్), శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), పీవీ సింధు (బ్యాడ్మింటన్) లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అలాగే తన ఈవెంట్ కోసం సిద్ధమవుతోన్న ఇషా సింగ్ (షూటింగ్)కు కూడా సీఎం బెస్ట్ విషెస్ చెప్పారు. వారంతా తర్వాతి దశల్లోనూ మంచి స్ఫూర్తిని కొనసాగించి విజయంతో దేశానికి మెడల్స్ సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.