కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలి: సీఎం రేవంత్‌రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌కు గతం ఉందిగానీ భవిష్యత్తు లేదన్నారు.
విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని, కేంద్రం రాజకీయంగా ఆలోచిస్తే..కాంగ్రెస్ కార్యాచరణ ఉంటుందని, సీబీఐ డైరక్టర్ ను నేరుగా కలిసి విచారణకు పట్టుబడుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. కేసీఆర్, హరీశ్ రావులు ఘోష్ కమిషన్ నియామకం, నివేదిక చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చినట్లుగా ప్రచారం చేస్తూ తెచ్చిపెట్టుకున్న నటన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అవతవకలపై నియమించిన పీ.సీ.ఘోష్ కమిషన్ నియామకం చట్టవిరుద్దం అని, ఏకపక్షం అని హైకోర్టు ఎక్కడా తప్పబట్టలేదని స్పష్టం చేశారు. కమిషన్ నియామకం చట్టబద్ధమేనంటూ జీవో కొట్టేయడం కుదరదని కోర్టు చెప్పిందని, మరి వాళ్ళు గెలిచినట్లా.. ప్రభుత్వం గెలిచినట్లా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సెక్షన్ ప్రకారం 8 ప్రకారం ప్రస్తుతం చర్యలు వద్దని మాత్రమే కోర్టు చెప్పిందని, కమీషన్ నివేదిక యధాతధంగా కొనసాగుతుందని రేవంత్ స్పష్టం చేశారు.
కాళేశ్వరం కూలిపోవడంపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, కాగ్ లు తమ నివేదికల్లో అక్రమాలు జరిగాయని స్పష్టం చేశాయని, మూడు నివేదికలు అక్రమాలు జరిగాయన్న చెప్పిన ఆధారంగా తక్షణమే సీబీఐ విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. లేకపోతే మేం భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం అన్నారు. ఫోన్ టాపింగ్ కేసు విచారణ త్వరలోనే కొలిక్కు వస్తుంది అని, కోర్టు మానిటరింగ్ చేస్తుందన, హైకోర్టు సుమోటోగా తీసుకుంది అని గుర్తు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఛార్జ్ షీట్ వేశాం అని, కేసు నడుస్తుందని, కేసు కోర్టుకు వెళ్ళిపోయిందని తెలిపారు.
బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు
బీఆర్‌ఎస్ పార్టీకి గతం ఉంది.. భవిష్యత్ లేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కవిత కొత్త పార్టీ గురించి మనకు ఎందుకు? అని, అసలు ఉన్న పార్టీ ఉంటుందా.. లేదో చూడండి అని ఎద్దేవా చేశారు. శవానికి ఎంత అలంకారం చేసిన లేచి రాదు అని, బీఆర్ఎస్ పార్టీ కూడా చచ్చిపోయిన శవంతో సమానం అన్నారు. అధికారం అడ్డం పెట్టుకొని అహంకారంతో పనిచేశారని. భరించలేక ప్రజలు అధికారం నుంచి దించారు అని గుర్తు చేశారు. కేసీఆర్ నుంచి సీఎం కుర్చీ లాక్కున్నానని, అంతకుమించి ఆయన దగ్గర ఇంకేం ఉంటుందన్నారు. కేసీఆర్ కుటుంబానికి, బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలతో సంబంధాలు లేవు అన్నారు. ఆ కుటుంబమంతా ఒక్కటేనని స్పష్టం చేశారు. కేసీఆర్ విశ్రాంతిలో ఉన్న ప్రజాప్రతినిధి. ఆయన మర మనిషో.. కాదో.. కుటుంబ సభ్యులకే తెలుసు అని రేవంత్‌రెడ్డి అన్నారు.
కేసీఆర్ నాకు రాజకీయ ప్రత్యర్థం మాత్రమే శత్రువు కాదు అని, కేసీఆర్ చావు నేనెందుకు కోరుకుంటానని, కేసీఆర్ ఆరోగ్యంగా ఉంటేనే మాకు మంచిదని రేవంత్ స్పష్టం చేశారు. వారసత్వాన్ని కోరుకునే వారే కేసీఆర్ చావు కోరుకుంటారు అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు కూటములు ఉంటాయి అని, ఒకటి కాంగ్రెస్, కమ్యూనిస్ట్, కోదండరాం ఒక కూటమి అని, మరొకటి బీఆర్ఎస్ బీజేపీ ఒక కూటమి అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కేసీఆర్ మాటలకు సీఎం రేవంత్ కౌంటర్
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడింది కేసీఆర్ కు కనిపించలేదా అని రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కవిత నిన్ను మర మనిషి అంటుందని, దానిపై సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
దేశంలో జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు పెంచలేదని, చిన్నా, పెద్ద రాష్ట్రాలకు వేరువేరు ప్రతిపాదనలు ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. మెజారిటీ లేదని తెలిసి కూడా డీలిమిటేషన్ సవరణ బిల్లు పెట్టారు అని, రాజ్యాంగాన్ని సవరించాలంటే 2/3 మెజారిటీ ఉండాలని వారికి తెలియదా అని ప్రశ్నించారు. 50% సీట్లు పెంచాలని ప్రధాని మోదీకి ఎవరు చెప్పారు అన్నారు. దక్షిణాధి రాష్ట్రాలకు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగకుండా 50% మెరిట్.. 50% జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయాలని డిమాండ్ చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
Heat Wave | అగ్ని గుండాన్ని తలపిస్తోన్న ఆదిలాబాద్.. అల్లాడిపోతున్న ప్రజలు
హైదరాబాద్‌లోని పెట్రోల్ బంకుల్లో మళ్లీ ‘నో స్టాక్’ బోర్డులు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram