CM Revanth Reddy| ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో ఫ్యూచర్స్ డెవలప్మెంట్ అథారిటీకి భవనానికి సీఎం రేవంత్ రెడ్డి పునాది రాయి వేసి శంకుస్థాపన చేశారు. అలాగే రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు వన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

CM Revanth Reddy| ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ (Future City)పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన(Foundation) చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో ఫ్యూచర్స్ డెవలప్మెంట్ అథారిటీకి భవనానికి సీఎం రేవంత్ రెడ్డి పునాది రాయి వేసి శంకుస్థాపన చేశారు. అలాగే రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు వన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు డి.శ్రీధర్ బాబు, ఆడ్లూరి లక్ష్మణ్ లు పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో, విజువల్ ఎగ్జిబిషన్ ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తిలకించారు. ఫ్యూచర్ సిటీలో చేపట్టనున్న పనుల వివరాలను అధికారులు వారికి వివరించారు.

30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం

భారత్ ఫ్యూచర్ సిటీ 30వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం కానుంది. ఫస్ట్ ఫేజ్ లో తొమ్మిది జోన్లు ఉండనున్నాయి. ఫ్యూచర్ సిటీలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, లైఫ్ సైన్సెస్, హెల్త్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, స్పోర్ట్స్ హబ్ లాంటి తొమ్మిది ప్రత్యేక జోన్‌లు ఉంటాయి. ఇది నెట్ జీరో కార్బన్ సిటీగా, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటుంది. ఇందులో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ప్రపంచంలోని ప్రముఖ విద్యా సంస్థల క్యాంపస్‌లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వంటివి ఏర్పాటు చేయనున్నారు. విమానాశ్రయానికి 200 అడుగుల రోడ్డు కనెక్టివిటీ, మెట్రో రైలు మార్గం, క్వాలిటీ విద్య, వైద్య సౌకర్యాలు ప్రధానంగా ఉంటాయి.