ఎస్ఎంఏ(SMA Type 2) వ్యాధితో బాధపడుతూ ప్రాణాలతో పోరాడుతున్న నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది చిన్నారి ఆర్యాన్ష్ కి అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. జులై 20 లోపు ఆ చిన్నారికి కోటిన్నర ఇంజెక్షన్ అత్యవసరమని సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి రావడంతో వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ చిన్నారికి బెస్ట్ ట్రీట్మెంట్ అందిస్తామని హామీ ఇచ్చారు. చికిత్స కోసం అవసరమైన ఆర్థిక సహాయం సమకూరుస్తామని భరోసా కల్పించారు. సీఎంవో అధికారులు వెంటనే చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి స్వయంగా ట్వీట్ చేశారు.
మేము చిన్నారి ఆర్యాన్ష్‌కు ఉత్తమ చికిత్సను అందిస్తామని, సీఎంఆర్ఎఫ్ బాధ్యతలు చూస్తున్న సీఎంఓ అధికారి వెంటనే తల్లిదండ్రులను సంప్రదిస్తారని రేవంత్ తన ట్వీట్ లో తెలిపారు. అతను పూర్తిగా కోలుకోవాలని మనమందరం ప్రార్థిద్దాం, ఆశిద్దాం అని, అతనికి మంచి, ఆరోగ్యకరమైన, దీర్ఘాయువు లభించాలని ఆకాంక్షిద్దాం అని రేవంత్ పేర్కొన్నారు.