విధాత, హైదరాబాద్ : తెలంగాణలో ప్రారంభమైన జనగణన-2027తొలి విడతలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన)లో పాల్గొని వివరాలను నమోదు చేసుకున్నారు. తెలంగాణలో ఆదివారం నుంచి ఆన్‌లైన్‌లో స్వీయ గణన ప్రారంభమైంది. తొలి రోజునే సీఎం రేవంత్ రెడ్డి వెబ్‌సైట్‌లో తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో ప్రజలంతా విశేషంగా పాల్గొనాలని వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
జనాభా లెక్కల కార్యక్రమంలో ముందుగా చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సెన్సస్ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. అంతకుముందు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మంత్రి పొన్నం ప్రభాకర్ లు కూడా సెల్ఫ్ ఎన్యుమరేషన్ జనగణనలో పాల్లొని వివరాలు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో సెన్సెస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి, జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్వీ కర్ణన్, జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ప్రియాంక అల, ఐపీఆర్టీ కమీషనర్ సీహెచ్. ప్రియాంక, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
