CM Revanth Reddy| మాజీ సీఎం బూర్గులకు సీఎం రేవంత్ రెడ్డి..కాంగ్రెస్ ఘన నివాళి

హైదరాబాద్ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభృతులు ఘనంగా నివాళులు అర్పించారు.

CM Revanth Reddy| మాజీ సీఎం బూర్గులకు సీఎం రేవంత్ రెడ్డి..కాంగ్రెస్ ఘన నివాళి

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు(Burgula Ramakrishna Rao) వర్ధంతి(death anniversary)సందర్బంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి( CM Revanth Reddy)ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, సామాజిక సంస్కర్తగా, రాజనీతిజ్ఞుడుగా బూర్గులు చేసిన సేవలను శ్లాఘించారు. లిబర్టీ క్రాస్ రోడ్‌లో బూర్గుల రామకృష్ణారావు విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి.మహేష్ కుమార్ గౌడ్(PCC Mahesh Kumar Goud) మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేశారని, వారి దూరదృష్టి ఇప్పటికీ మనందరికీ ఆదర్శమని అన్నారు. భవిష్యత్ తరాలకు బూర్గుల స్ఫూర్తిదాయక నేతగా నిలిచారని పేర్కొన్నారు. వారి చూపిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ప్రజాసేవకు కట్టుబడి ఉందని తెలిపారు. యువతరానికి బూర్గుల రామకృష్ణారావు గారు మార్గదర్శి అని కొనియాడారు.