హైదరాబాద్ వస్తున్నా..అక్కడే మాట్లాడుతా: సీఎం రేవంత్ రెడ్డి

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ.. సహా అన్ని అంశాలపై హైదరాబాద్ కు వెళ్లాక మాట్లాడుతానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. లండన్‌ పర్యటనను విజయవంతంగా ముగించుకున్నట్లు తెలిపారు. అనుమతి లేని కారణంగా అమెరికా వెళ్లడం లేదని, మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌కు వస్తానని, వచ్చాక మిగిలిన అంశాలపై మాట్లాడతానన్నారు.

విధాత : అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ.. సహా అన్ని అంశాలపై హైదరాబాద్ కు వెళ్లాక మాట్లాడుతానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ కోణంలోనే తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వట్లేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్రం అనుమతి నిరాకరించడంతో బోస్టన్‌కు వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు.

లండన్‌ పర్యటనను విజయవంతంగా ముగించుకున్నట్లు తెలిపారు. మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌కు వస్తానని, వచ్చాక మిగిలిన అంశాలపై మాట్లాడతానన్నారు. విదేశీ పర్యటన అంశంలో తనకు మద్దతుగా నిలిచిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

Latest News