CM Revanth Reddy | సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు కొత్త భవనాలు

రాష్ట్రంలోని రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు మహర్దశ పట్టనున్నది. ఇరుకు, అద్దె భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాల స్థానంలో కార్పొరేట్ కార్యాలయాలను తలదన్నే రీతిలో అధునాతన భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు

CM Revanth Reddy | సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు కొత్త భవనాలు

కార్పొరేట్ ఆఫీసులను తలదన్నేలా ఉండాలి
ప్రజలకు సకల సదుపాయాలు కల్పించాలి
అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
రాష్ట్రంలో మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు
38 మాత్రమే సొంత భవనాల్లో
ఎన్నికల కోడ్‌ ముగియగానే రెండు భవనాలకు ప్రారంభం
మిగిలినవాటికి కొత్త భవనాల నిర్మాణం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు మహర్దశ పట్టనున్నది. ఇరుకు, అద్దె భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాల స్థానంలో కార్పొరేట్ కార్యాలయాలను తలదన్నే రీతిలో అధునాతన భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లకు వచ్చేవారు కూర్చొనేందుకు వీలు లేకుండా పోవడంతో చెట్ల కింద, నీడ దొరికిన చోట సర్దుకుపోతున్నారు. కార్యాలయాలు కూడా సీజన్లలో కిక్కిరిసిపోతున్నాయి. కనీసం అక్కడ కూర్చొనే పరిస్థితి కూడా లేదు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకూ కార్యాలయంలో నిలబడే ఉండాల్సి వస్తున్నది. ఇకపై ఇలాంటి పరిస్థితి ఉండరాదని భావించిన ముఖ్యమంత్రి.. ఈ అంశంపై అధికారులతో చర్చించారు.

రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను మోడల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసులుగా తీర్చిదిద్దాలని వారిని ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయి. వీటిలో 38 మాత్రమే సొంత భవనాల్లో నడుస్తున్నాయి. ఆదిలాబాద్‌లోని బోథ్, మేడ్చల్ జిల్లా షామీర్ పేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మిగతా 104 ఆఫీసులు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. 52 చోట్ల కార్యాలయాలకు అవసరమయ్యే భవనాల నిర్మాణానికి ప్రభుత్వ భూమి కూడా కేటాయించారు.

భూములు సిద్ధంగా ఉన్న చోట వీలైనంత త్వరగా మోడల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులను నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. మిగతా 52 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సరిపడే స్థలాలను అన్వేషించాలని, పబ్లిక్ యుటిలిటీ కింద సేకరించిన స్థలాలు అందుబాటులో ఉంటే.. అక్కడే నూతన భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు. మొదటి దశలో ఆదాయం ఎక్కువగా తెచ్చిపెడుతున్న రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నిర్మాణాలకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు.

అక్కడికి వచ్చే క్రయ విక్రయదారులు తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసేంత సేపు మంచి ఆతిథ్యమిచ్చే, ఆహ్లాదంగా ఉండే కార్పొరేట్ లుక్, వెయిటింగ్ హాల్, తాగునీటి సదుపాయం, కెఫేటెరియా లాంటి అన్ని సదుపాయాలుండాలని సీఎం చెప్పారు. అవన్నీ ఉండేలా అధునాతన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే చోట సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాల ఆఫీసుల నుంచి ఎక్కువ పని ఉన్న చోటికి సిబ్బందిని సర్దుబాటు చేయాలని ఆదేశించారు.

హైదరాబాద్‌: రాష్ట్రంలోని రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు మహర్దశ పట్టనున్నది. ఇరుకు, అద్దె భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాల స్థానంలో కార్పొరేట్ కార్యాలయాలను తలదన్నే రీతిలో అధునాతన భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లకు వచ్చేవారు కూర్చొనేందుకు వీలు లేకుండా పోవడంతో చెట్ల కింద, నీడ దొరికిన చోట సర్దుకుపోతున్నారు. కార్యాలయాలు కూడా సీజన్లలో కిక్కిరిసిపోతున్నాయి. కనీసం అక్కడ కూర్చొనే పరిస్థితి కూడా లేదు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకూ కార్యాలయంలో నిలబడే ఉండాల్సి వస్తున్నది. ఇకపై ఇలాంటి పరిస్థితి ఉండరాదని భావించిన ముఖ్యమంత్రి.. ఈ అంశంపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలోని రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను మోడల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసులుగా తీర్చిదిద్దాలని వారిని ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయి.

వీటిలో 38 మాత్రమే సొంత భవనాల్లో నడుస్తున్నాయి. ఆదిలాబాద్‌లోని బోథ్, మేడ్చల్ జిల్లా షామీర్ పేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మిగతా 104 ఆఫీసులు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. 52 చోట్ల కార్యాలయాలకు అవసరమయ్యే భవనాల నిర్మాణానికి ప్రభుత్వ భూమి కూడా కేటాయించారు. భూములు సిద్ధంగా ఉన్న చోట వీలైనంత త్వరగా మోడల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులను నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. మిగతా 52 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సరిపడే స్థలాలను అన్వేషించాలని, పబ్లిక్ యుటిలిటీ కింద సేకరించిన స్థలాలు అందుబాటులో ఉంటే.. అక్కడే నూతన భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు.

మొదటి దశలో ఆదాయం ఎక్కువగా తెచ్చిపెడుతున్న రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నిర్మాణాలకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. అక్కడికి వచ్చే క్రయ విక్రయదారులు తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసేంత సేపు మంచి ఆతిథ్యమిచ్చే, ఆహ్లాదంగా ఉండే కార్పొరేట్ లుక్, వెయిటింగ్ హాల్, తాగునీటి సదుపాయం, కెఫేటెరియా లాంటి అన్ని సదుపాయాలుండాలని సీఎం చెప్పారు. అవన్నీ ఉండేలా అధునాతన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే చోట సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాల ఆఫీసుల నుంచి ఎక్కువ పని ఉన్న చోటికి సిబ్బందిని సర్దుబాటు చేయాలని  ఆదేశించారు.