- 20న సీఎం రేవంత్ మేడిగడ్డ సందర్శన
- ఇరిగేషన్ అధికారులతో సీఎం సమీక్ష
- కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం
- సాయంత్రం నస్తూరపల్లిలో బహిరంగసభ
- రెండవ విడత రైతుభరోసా నిధుల విడుదల
విధాత, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి 20వ తేదీ సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించ నున్నారు. సీఎం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి మధ్యాహ్నం 1.45 గంటలకు హైదరాబాద్ లోని సీఎం నివాసం నుంచి బయలుదేరి 2.00 గంటలకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3.00 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.05 నుండి 3.25 గంటల మధ్య శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసి, ఆలయం వద్ద భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. 3.30 గంటలకు కాళేశ్వరం నుంచి బయలుదేరి 3.45 గంటలకు మహాదేవపూర్ మండలం మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడ 3.45 నుండి 4.30 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. సాయంత్రం 4.35 నుండి 5.30 గంటల వరకు అంబట్‌పల్లి గెస్ట్ హౌస్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 5.35 నుండి 6.00 గంటల వరకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. 6.00 గంటలకు మేడిగడ్డ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.30 గంటలకు కాటారం మండలం నస్తూరపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ 6.30 నుండి 7.45 గంటల వరకు రైతు భరోసా పథకం రెండో విడత నిధులను విడుదల చేస్తారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. తదుపరి రాత్రి 7.45 గంటలకు నస్తూరపల్లి నుంచి బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసానికి రోడ్డు మార్గంలో చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా యంత్రాంగం భారీ బందోబస్తుతో పాటు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. బహిరంగసభను జయప్రదం చేసేందుకు ప్రభుత్వం యంత్రాంగంతో పాటు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా జనాన్ని సమీకరించే పనుల్లో నిమగ్నమయ్యారు.
!!!
