Anjan Kumar Yadav : మంత్రి కావాలనే జూబ్లీహిల్స్ టికెట్ కోరుతున్నా

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ కోరుతున్నానని, గెలిస్తే మంత్రి అవుతానని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు.

Anjan Kumar Yadav : మంత్రి కావాలనే జూబ్లీహిల్స్ టికెట్ కోరుతున్నా

విధాత, హైదరాబాద్ : మంత్రి కావాలనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోరుతున్నానని..ప్రజలు కూడా టికెట్ నాకే ఇవ్వాలని కోరుకుంటున్నారని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో మా యాదవ సామాజిక వర్గం నుంచి మంత్రి లేరని.. యాదవ సామాజిక వర్గంలో కాంగ్రెస్ పార్టీలో నేనే సీనియర్ నాయకుడినని అంజన్ కుమార్ చెప్పుకొచ్చారు. అదిగాక గ్రేటర్ హైదరాబాద్ నుంచి కేబినెట్ లో చోటు లేదని..నేను జూబ్లీహిల్స్ లో గెలిస్తే నాకు కేబినెట్ బెర్త్ చాన్స్ ఉంటుందన్నారు. నా కుమారుడికి యూత్ కాంగ్రెస్ కోటలో రాజ్యసభ సీటు ఇచ్చారన్నారు.

కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నానని..నాకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతున్నానని తెలిపారు. పార్టీలో నేను సీనియర్ నాయకుడినని..మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నాకంటే జూనియర్ యేనన్నారు. జూబ్లీహిల్స్ లో నేనే అసలైన లోకల్ లీడర్ అని.. నేను పాకిస్థాన్ నుండి రాలేదు కదా? అన్నారు. నాలుగు సార్లు ఎంపీగా పోటీ చేసిన్నపుడు ఇక్కడి ప్రజలు నాకు ఓట్లు వేశారని..నేను ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులు చేశానని చెప్పారు.