KTR | కాంగ్రెస్ సర్కారు తెలంగాణ సమాచారాన్ని తొలగిస్తోంది … న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్న కేటీఆర్
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని కుట్రపూరితంగా తొలగిస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే చర్యల తీసుకోండని సీఎస్ నుకోరిన కేటీఆర్
గతంలో ఇదే అంశంపై సీఎస్ కు లేఖ రాసిన కేటీఆర్
వెంటనే చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్న కేటీఆర్
విధాత: తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని కుట్రపూరితంగా తొలగిస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి వెంటనే చర్యలు చేపట్టి ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని కాపాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ని కోరారు. ఈ అంశంలో ఇప్పటికే సీఎస్ గారికి కేటీఆర్ గారు గతంలో బహిరంగ లేఖ ద్వారా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖ విషయాన్ని మరోసారి సీఎస్ కు గుర్తు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ పై కోపంతో తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్లు, డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ముఖ్యమైన సమాచారాన్ని తొలగించిన విషయాన్ని సీఎస్ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తొలగించిన సమాచారమంతా తెలంగాణ చరిత్ర లో అంతర్భాగమన్నారు. రాష్ట్ర చరిత్ర, ముఖ్యమైన సమాచారమంతా భవిష్యత్ తరాలకు అందిచేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. సీఎస్ స్పందించకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు.