GHMC | ఇక నుంచి జీహెచ్ఎంసీలో 12 జోన్లు, 60 సర్కిల్స్..!
GHMC | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల పునర్విభజనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు సంబంధించి గురువారం రాత్రి ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
GHMC | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల పునర్విభజనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు సంబంధించి గురువారం రాత్రి ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
డివిజన్ల సంఖ్యను 300కు పెంచుతూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది ప్రభుత్వం. ఇక జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12 జోన్లకు, 30 సర్కిల్స్‌ను 60 సర్కిల్స్‌కు పెంచుతున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
కొత్త జోన్‌లు ఇవే..
కొత్త జోన్‌లుగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ఏర్పడ్డాయి. సర్కిల్ కార్యాలయాల్లో కొత్త జోన్ కార్యాలయాలు, వార్డు కార్యాలయాల్లో నూతన సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.
డివిజన్ల డీలిమిటేషన్‌కు సంబంధించి ఈనెల 9న ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడగా.. 10 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరించారు. 6వేలకు పైగా అభ్యంతరాలు రాగా.. సహేతుకమైన వాటిని పరిగిణనలోకి తీసుకొని తుది నోటిఫికేషన్ విడుదల చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram