Kamareddy BC Declaration Rally : కాంగ్రెస్ కామారెడ్డి సభ వాయిదా

భారీ వర్షాల కారణంగా కాంగ్రెస్‌ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ విజయోత్సవ సభ వాయిదా.. కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్న టీపీసీసీ.

Kamareddy BC Declaration Rally : కాంగ్రెస్ కామారెడ్డి సభ వాయిదా

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించ తలపెట్టిన బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను వాయిదా వేస్తున్నట్లుగా టీపీసీసీ(TPCC) ఒక ప్రకటనలో వెల్లడించింది. భారీ వర్ష సూచన కారణంగా ఈ సభను వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని పీసీసీ తెలిపింది.

బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి..రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాల మద్దతు కూడగట్టుకోవాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఈనెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ విజయోత్సవ సభ(Kamareddy BC Declaration Rally) నిర్వహణకు నిర్ణయించింది. లక్ష మందికిపైగా జన సమీకరణతో ప్రతిష్ఠాత్మకంగా సభ నిర్వహించాలని సన్నాహాలు చేపట్టింది. సభకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi), పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge), ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal), కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలను ఆహ్వానించాలని రాష్ట్ర నాయకత్వం భావించింది. ఈ సభా వేదిక నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు సమరభేరీ మ్రోగించాలనుకుంది. పీసీసీ అధ్యక్షుడు సహా మంత్రులు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇంతలోనే భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి(Kamareddy) సభను వాయిదా వేస్తున్నట్లుగా టీపీసీసీ ప్రకటించింది.