నేడు కాంగ్రెస్ పీఏసీ మీటింగ్..ఎంపీ స్థానాలపై నజర్
కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మీటింగ్ నేడు సోమవారం గాంధీభవన్‌లో భేటీ కానుంది

విధాత : కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మీటింగ్ నేడు సోమవారం గాంధీభవన్‌లో భేటీ కానుంది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగునున్న ఈ సమావేశంలో పార్లమెంటు ఎన్నికలకు సన్నద్దత..రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కీలక చర్చలు జరుపనున్నారు.
పార్టీ అధికారంలోకి రావడంతో పాలన పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు..పార్టీ నాయకులకు ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన నామినేటెడ్ పదవులు, ఖాళీ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినందునా రాష్ట్రంలోని 17ఎంపీ సీట్లలో సింహభాగం సీట్లను హస్తగతం చేసుకునేందుకు రోడ్‌మ్యాప్ రూపకల్పనపై కూడా పీఏసీ దృష్టి సారించనుంది. ఎన్నికల అనంతరం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి పీఏసీ సమావేశం కావడంతో పార్టీ పీఏసీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు.