కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డినే : షబ్బీర్ అలీ

కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డినే : షబ్బీర్ అలీ

విధాత : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డినే కాబోయే ముఖ్యమంత్రి అని, కామారెడ్డిలో ఆయనను గెలిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, నిజామాబాద్ అర్భన్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్‌ షబ్బీర్ అలీ వ్యాఖ్యనించారు. మాచారెడ్డి మండలం రెడ్డిపేటలో కాంగ్రెస్ చేపట్టిన రోడ్ షోలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డినే సీఎం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘షబ్బీర్ ఎక్కడికీ పోలేదని, మీ గుండెల్లో ఉన్నాడని, తెలంగాణ ప్రజల మేలు కోసం రేవంత్ రెడ్డిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. షబ్బీర్ అలీ వ్యాఖ్యలు కాంగ్రెస్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.