ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే!.. బీఆరెస్‌పై కాంగ్రెస్‌ ట్వీట్టర్‌ వార్‌

  • Publish Date - October 13, 2023 / 09:13 AM IST
  • కర్ణాటకలో పట్టుబడిన నగదుపై పంచాయితీ


విధాత : కర్ణాటకలో పట్టుబడిన 42కోట్లు కాంగ్రెస్‌ తెలంగాణ ఎన్నికల్లో పంచేందుకు తరలించేందుకు సిద్ధం చేసిన డబ్బేనని బీఆరెస్‌ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు చేసిన ఆరోపణలు, ట్వీట్లపై కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్టర్‌ వేదికగానే తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే! అన్నట్టుగా బీఆరెస్‌ వ్యవహారం ఉందంటూ తెలంగాణ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. బీజేపీ, బీఆరెస్‌ రహస్య సంబంధం బయటపడటంతోనే కాంగ్రెస్ పై ఎదురు దాడి చేస్తుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మిత్ర పక్షమైన జేడీఎస్ మాజీ కార్పొరేటర్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాల్లో 42 కోట్లు దొరికాయన్నారు.


నగదుతో పట్టుబడిన కాంట్రాక్టర్‌ అంబికాపతి గత బీజేపీ ప్రభుత్వ హయాంలో కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయిన జేడీఎస్ మాజీ కార్పొరేటర్ భర్త అన్న విషయాన్ని కాంగ్రెస్‌ పేర్కోంది. బీఆరెస్‌కు తెలంగాణ ఎన్నికల్లో సహాయం చేసేందుకు జేడీఎస్ ద్వారా వేల కోట్ల రూపాయలు బీజేపీ పంపుతుందని ఆరోపించింది. గత ఎన్నికల్లో బీజేపీకి లబ్ది కుదుర్చేలా జేడీఎస్ నేత కుమారస్వామికి కేసీఆర్‌ మద్దతునిచ్చారని, ఇప్పుడు కాంగ్రెస్ ను అడ్డుకోవడానికి బీఆరెస్‌కు కావాల్సిన డబ్బుతో బీజేపీ మద్దతు తెలుపుతుందని కాంగ్రెస్‌ తన ట్వీట్‌లో ఆరోపించింది.