రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి : సీపీఐ నేదునూరి జ్యోతి
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములిచ్చిన అయోధ్యపురం రైతులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న ₹25 లక్షల పరిహారాన్ని చెల్లించాలని సీపీఐ డిమాండ్ చేసింది.
విధాత, వరంగల్ ప్రతినిధి: రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి అయోధ్యపురం గ్రామంలో 114 మంది రైతులు నూట అరవై ఎకరాల భూములు ఇచ్చారని, వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు, స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని అధికారులు, పాలకులు చెప్పి ఇవ్వకపోవడాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. సోమవారం మడికొండలో మాలోతు శంకర్ అధ్యక్షతన సీపీఐ కాజీపేట మండల సర్వసభ్య సమావేశం జరగగా నేదునూరి జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎకరానికి 33 లక్షలు లెక్క కట్టి ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే రైతాంగానికి చెల్లించి 25 లక్షల రూపాయలు చెల్లించకపోవడం అన్యాయమని, భూములు ఇచ్చినటువంటి రైతులకే 25 లక్షలు ఇచ్చి ఉద్యోగాలు కేటాయించాలని పాలకవర్గాలను డిమాండ్ చేశారు. ఇప్పటికీ 9 ఎకరాల మూడు గుంటలకు ఎనిమిది మంది రైతులకు డబ్బులు ఇవ్వలేదని తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధి పేరుతో పేదల భూములు గుంజుకొని రైతుల్ని కూలీలుగా మార్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదని, దేవుని మాన్యాల భూమి పేరుతో, సీలింగు భూమి పేరుతో పేద రైతుల్ని దగా చేయడం సరైనది కాదని తెలిపారు. బి ఆర్ భగవాన్ దాస్,మడత కాళిదాస్ కలలు గన్న స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చే వరకు సిపిఐ పోరాడుతుందన్నారు. లోక రక్షకుడు శ్రీరాముడని తెలుపుతూ రామరాజ్యం అంటే రైతుల భూముల్ని లాక్కొని కూలీలుగా మార్చడం కాదని, భూ నిర్వాసితులకు మార్కెట్ ధర చెల్లించాలని వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని, రైల్వే ఫ్యాక్టరీ ప్రాంతంలో స్టాల్స్ ఏర్పాటుకు వారి కుటుంబాలకు స్వయం ఉపాధి కొరకు కేటాయించాలని జ్యోతి డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని వెంటనే భూనిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు.తెలంగాణ రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ పరిశ్రమలు స్థాపించాలని,రైల్వే కూడలి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ స్థాపించి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో దశాబ్దాల సుదీర్ఘ పోరాటం అనంతరం కాజీపేట అయోధ్య పురంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బికేఎంయు జాతీయ నాయకులు మోతే లింగారెడ్డి, హనుమకొండ జిల్లా సీపీఐ కార్యవర్గ సభ్యులు నేదునూరి రాజమౌళి, మునిగాల బిక్షపతి,నాయకులు దొమ్మాటి ప్రవీణ్ కుమార్, దుస్సా వెంకటేశ్వర్లు, భూనిర్వాసితులు మామిండ్ల బిక్షపతి, మామిండ్ల శ్రీకాంత్, మల్లయ్య, రాజు, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Telangana Journalist Accreditation : తెలంగాణ జర్నలిస్టులకు గుడ్ న్యూస్..కొత్త అక్రిడిటేషన్ల జారీకి జీవో విడుదల
Ponguleti Srinivas Reddy : ఒకే గొడుగు కిందకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram