MLA Kunamneni | ప్రగతిశీల మార్పులో కమ్యూనిస్టుల త్యాగం.. పొత్తుల కోసం వెంపర్లాడ కూడదు: ఎమ్మెల్యే కూనoనేని
గత వందేళ్ళుగా ఈ దేశంలో వచ్చిన ప్రతీ ప్రగతిశీల మార్పు వెనుక కమ్యూనిస్టుల, పోరాటాలు,త్యాగాల వలనే వచ్చాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు.
విధాత, వరంగల్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రం పార్టీ జిల్లా నిర్మాణ సమావేశం డోర్నకల్ నియోజకవర్గ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి ఆధ్యక్షతన జరిగింది. ముందుగా పార్టీ పతాకాన్నీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు ఎగుర వేశారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి కూనంనేని మాట్లాడుతూ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న ఏకైక పార్టీ సిపిఐ అని అన్నారు. మనపార్టీ నాయకత్వం నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి, నిస్వార్థంతో పనిచేసి ప్రతీ గ్రామం లో పార్టీని విస్తరిoప చేయాలన్నారు. రాష్ట్రంలో బీఆరెఏస్ ఖాళీ అవుతున్న నేపథ్యంలో మనం ఆ స్థానాన్ని భర్తీ చేసుకోవాలని సూచించారు. రాబోయే రోజులలో పొత్తుల కోసం వెంపర్లాడమని, స్థానిక సంస్థల ఎన్నికలలో మన పార్టీ క్రియాశీలకంగా పాల్గొనడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి బి. విజయ సారధి కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టగా ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్రరాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తమ్మేర విషవేశ్వర్ రావు, బి అజయ్ సారధి రెడ్డి, కట్టెబోయిన శ్రీనివాస్, పార్టీ మండల కార్యదర్శి కరణం రాజన్న, పోగుల శ్రీనివాస్ గౌడ్, నెల్లూరు నాగేశ్వర్ రావు, పెరుగు కుమార్, వరిపల్లి వెంకన్న, బుర్ర సమ్మయ్య, తురక రమేష్, కన్నె వెంకన్న, పాండురంగా చారీ,చింతకుంట్ల వెంకన్న, సాంబలక్ష్మి,ఒమ బిక్షపతి, నవీన్,బాలకృష్ణ, రషీద్ తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram